YS Jagan Modi : మోదీజీ ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్
ప్రధాన మంత్రికి ఏపీ సీఎం విన్నపం
YS Jagan Modi : మరోసారి చర్చకు వచ్చింది ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి. ఏపీలో రూ. 3 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డి(YS Jagan Modi) సుదీర్ఘ వినతిపత్రం సమర్పించారు ప్రధానికి. ఉమ్మడి ఏపీని విభజించడం వల్ల తమ రాష్ట్రం కోలుకోలేని రీతిలో నష్టానికి గురైందని వాపోయారు.
ఇప్పటికే పలు మార్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరామని, ఈసారి కూడా ఇదే సమయంలో విన్నవిస్తున్నట్లు తెలిపారు. భీమవరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు.
ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రాష్ట్రం గట్టెక్కాలంటే మిగిలింది ఒక్కటే మార్గమని అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు.
ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్ ) ఇస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు జగన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచానల ప్రకారం రూ. 55, 548.87 కోట్లకు వెంటనే ఆమోదం తెలపండి అంటూ మోదీకి సీఎం విన్నవించారు.
అంతే కాకుండా తెలంగాణ డిస్కంల నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన రూ. 6,627 కోట్లు ఇప్పించాలని కోరారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీకి ఇస్తున్న రేషన్ లో పారదర్శకత లోపించిందన్నారు.
రాష్ట్రానికి మేలు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రానికి మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : మన్నెం వీరుడు జనం మరువని యోధుడు – జగన్