YS Jagan Pawan : పవన్ కు అమ్మాయిల పిచ్చి – జగన్ రెడ్డి
జనసేన పార్టీ చీఫ్ పై సంచలన కామెంట్స్
YS Jagan Pawan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన సభలో సంచలన కామెంట్స్ చేశారు. ఆయన పూర్తి స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడం విస్తు పోయేలా చేసింది. గత కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.
YS Jagan Pawan Discussion
ఇవాళ వ్యక్తిగత దూషణలకు తెర లేపారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు అమ్మాయిలంటే పిచ్చి. అని వాడుకుని వదిలేస్తుంటాడని ఆరోపించారు. వివాహేతర సంబంధం పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఎలా ప్రజలకు జవాబుదారీగా ఉంటాడని ప్రశ్నించారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు లోబర్చు కోవడం , వారిని పెళ్లిళ్లు చేసుకోవడం , నాలుగేళ్ల కాపురం చేసి వదిలి వేయడం పవన్ కళ్యాణ్ కు రివాజుగా మారిందని ఆరోపించారు జగన్ రెడ్డి. ఒకరితో వివాహ బంధంలో ఉంటాడు. మరొకరితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తాడంటూ ధ్వజమెత్తారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
తనను హక్కు, అర్హత ఈ నేతలకు లేదన్నారు. చంద్రబాబుకు వయస్సు మళ్లినా ఇంకా బుద్ది రాలేదన్నారు. లోకేష్ కు సిగ్గు లేదంటూ ధ్వజమెత్తారు.
Also Read : AP CM YS Jagan : బుద్ది లేనోడు బాబు సిగ్గు లేనోడు లోకేష్