YS Jagan : వరద బాధితులకు జగన్ రెడ్డి భరోసా
స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
YS Jagan : వరద బాధితులందరికీ పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం పర్యటించారు.
అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న సందర్భంగా బాధితులతో మాట్లాడించారు. ఈ కష్ట సమయంలో రాజకీయాలు మాట్లాడటం బాధా కరమన్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan).
తన సిస్టమ్ వేరన్నారు. నేనే గనుక ఇక్కడికి వెంటనే వస్తే సహాయక చర్యలలో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. అందుకే వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు.
ప్రతి ఒక్కరికి మంచి చేసే బాధ్యత తనదన్నారు. బాధితులకు ఎలాంటి నష్టం రాకుండా చూసే బాధ్యత తనపై ఉందని , మీ కన్నీళ్లు తుడుస్తానని మరోసారి స్పష్టం చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపారు. సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడ ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. అంతే కాకుండా వరద ప్రభావిత జిల్లాలకు నిధులు కూడా మంజూరు చేశామని తెలిపారు.
జి. పేదపూడి లంక వద్ద వంతెన (బ్రిడ్జి) నిర్మిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని ప్రకటించారు బాధితుల సాక్షిగా.
ఇదిలా ఉండగా వర్షాలను సైతం లెక్క చేయకుండా పర్యటించడం విశేషం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : రైతన్నలకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్