YS Jagan : పిల్ల‌ల చ‌దువు కోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తాం

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

YS Jagan : త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఒక్క‌టే. దేశంలో ఎక్క‌డా లేని విధంగా విద్య ఉండాల‌ని. ఆ దిశ‌గా తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan). కార్పొరేట్ స్కూళ్ల‌ను త‌ల‌ద‌న్నేలా ప్ర‌భుత్వ బ‌డులు ఉండాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు.

ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌ధాన ల‌క్ష్యం విద్య‌, వైద్యం, ఉపాధి అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీఎం. ప్ర‌పంచంలో విద్య‌కు ఉన్నంత ప్రాధాన్య‌త ఏదీ లేద‌న్నారు.

అందుకే త‌మ స‌ర్కార్ ప్ర‌పంచానితో పోటీ ప‌డేలా విద్యార్థుల‌ను తీర్చి దిద్దేందుకు కంక‌ణం క‌ట్టుకున్నామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. పిల్లల చ‌దువు కోసం ఎన్ని కోట్ల రూపాయ‌లైనా ఖ‌ర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

మూడో ఏడాది జ‌గ‌నన్న విద్యా కానుక కింద విద్యార్థుల‌కు కిట్ల‌ను పంపిణీ చేసింది. సీఎం వీటిని క‌ర్నూలు జిల్లా ఆదోనిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వీటిని అంద‌జేశారు.

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ బ‌డుల్లో ఒక‌టిన ఉంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న 47,40,421 మంది విద్యార్థుల‌కు ఇవి అంద‌జేస్తారు.

ఇందు కోసం రూ. 931.02 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. పేద‌రికం బ‌య‌ట ప‌డాలంటే చ‌దువు అన్న‌ది ముఖ్యం.

ఒక్క కుటుంబంలో ఒక‌రు చ‌దివితే ఆ ఇల్లు బాగు ప‌డుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేరాల‌ని సూచించారు.

నాణ్య‌మైన చ‌దువుతోనే పేద‌రికం పోతుంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). పిల‌ల్ని బ‌డికి పంపే త‌ల్లుల‌కు అమ్మ ఒడిని అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

Also Read : ఏం బైరెడ్డి కుశ‌ల‌మేనా – మోదీ

 

Leave A Reply

Your Email Id will not be published!