YS Jagan Vijay Sai CBI : జ‌గ‌న్..విజ‌య సాయికి సీబీఐ కోర్టు షాక్

విదేశీ టూర్ ప‌ర్మిష‌న్ పై నిర్ణ‌యం వాయిదా

YS Jagan Vijay Sai CBI : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. యూకే వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై వాద‌న‌లు ముగిశాయి. సెప్టెంబ‌ర్ 2న లండ‌న్ ఉంటున్న త‌న కూతురు వ‌ద్ద‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ఆగ‌స్టు 28న సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

YS Jagan Vijay Sai CBI Shock

దేశం విడిచి వెళ్ల రాద‌న్న బెయిల్ ష‌ర‌తులు స‌డలించాల‌ని పిటిష‌న్ లో జ‌గ‌న్ రెడ్డి(YS Jagan) కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది..

మరోవైపు, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిందే. విజయసాయిరెడ్డి పిటిషన్ పైనా ఇవాళ వాదనలు ముగిశాయి. ఆయ‌న టూర్ కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. కోర్టును దృష్టికి తీసుకెళ్లింది.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!