YS Sharmila Kaleshwaram : కాళేశ్వ‌రం అవినీతిపై ఢిల్లీలో ధ‌ర్నా – ష‌ర్మిల‌

సీఎం కేసీఆర్ దిక్కు మాలిన పాల‌న

YS Sharmila Kaleshwaram : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మార్చి 14న మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో(YS Sharmila Kaleshwaram) చోటు చేసుకున్న అవినీతిపై ధ‌ర్నా చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఒక్క దానినే రాష్ట్రంలో అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నాన‌ని అన్నారు. పారే ఎక‌రాల్లో చేసిన ఖ‌ర్చుల్లో అన్నీ దొంగ లెక్క‌లేన‌ని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కోట్లాది రూపాయ‌లు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని వైఎస్ ష‌ర్మిల ఆరోపించారు.

ఆనాడు దివంగ‌త ఏపీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 16.46 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌ని రూ. 38 వేల కోట్ల‌తో అంబేద్క‌ర్ ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశార‌ని గుర్తు చేశారు. కానీ తెలంగాణ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన సీఎం కేసీఆర్ కాంట్రాక్ట‌ర్లు ఇచ్చే క‌మీష‌న్ల‌కు కక్కుర్తి ప‌డి కాళేశ్వ‌రం ప‌క్క దారి ప‌ట్టించాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని చెప్పాడు. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టాడ‌ని , ఇవాళ తెలంగాణ‌ను మ‌ద్యానికి బానిస అయ్యేలా చేశాడంటూ ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాము కాళేశ్వ‌రంలో చోటు చేసుకున్న అవినీతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఢిల్లీలో చేప‌ట్టే ధ‌ర్నాకు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీలు క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. జంత‌ర్ మంత‌ర్ నుంచి పార్ల‌మెంట్ భ‌వ‌న్ వ‌ర‌కు జ‌రిగే మార్చ్ లో పాల్గొనాల‌ని ఆమె కోరారు.

ద‌ళిత సీఎం అన్నారు. డ‌బుల్ బెడ్రూమ్ లు ఇస్తాన‌న్నాడు కానీ వాటిని ఏ ఒక్క‌టి అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.

Also Read : మోదీ అదానీ బంధం బ‌య‌ట పెట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!