YS Sharmila : మన్నించండి మద్దతు ఇవ్వండి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్
YS Sharmila : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా బరిలో ఉంటానని బీరాలు పలికిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మాట మార్చారు. తాను తెలంగాణ ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం గత్యంతరం లేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
YS Sharmila Requests
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను ఏనాడూ ఎవరి పంచన చేరలేదన్నారు. ఎవరినీ దేబరించాల్సిన అవసరం తనకు రాలేదన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని, మడమ తిప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila).
తనను స్వంత బిడ్డ కంటే ఎక్కువగా ఆదరించారంటూ సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేసీఆర్ రాక్షస పాలన, అంతులేని దోపిడీ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తం చేసేందుకు తాను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాల్సి వచ్చిందని , దయచేసి అర్థం చేసుకుని తనను మన్నించి, మద్దతు ఇవ్వాలని కోరారు షర్మిల.
ఇక నుంచి పార్టీకి చెందిన నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పటి లాగే ఆదరించాలని హస్తంకు ఓటు వేయాలని కోరారు.
Also Read : Minister Ramalinga Reddy : కరెంట్ కష్టాలు నిజమే