Sharmila Arrest : వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్
హైదరాబాద్ కు పోలీసుల తరలింపు
Sharmila Arrest : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila Arrest) పాదయాత్రకు బ్రేక్ పడింది. ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేశారు. అంతేకాకుండా కల్వకుంట్ల ఫ్యామిలీపై మండిపడ్డారు.
ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిప్పులు చెరిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు యాత్రను అడ్డుకున్నారు. ఆమెను హైదరాబాద్ కు తరలించారు. సభ్య సమాజం సిగ్గు పడేలా తాను వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు ఆరోపించారు.
వారంతా ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన పోలీసులు యాత్రకు ఆటంకం కలిగించారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమె రథ యాత్రపై దాడికి పాల్పడ్డారు. కోర్టు కొన్ని పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. అయినా తన తీరు మార్చుకోలేదు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ వెళ్లారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో తప్పు లేదని కానీ వ్యక్తులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ఈ మొత్తం వ్యవహారంపై షర్మిల ఇంకా మాట్లాడలేదు. మహబూబాబ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంతో వైఎస్ షర్మిలపై సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు. హామీలు ఇచ్చినా నెరవేర్చని మీ ఎమ్మెల్యే వేస్ట్ అని ఎద్దేవా చేశారు. ఆమెను ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
Also Read : పవర్ లోకి వస్తే ప్రజా పాలన – సీఎం