YS Sharmila : 3 వేల కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న ష‌ర్మిల

3 వేల కిలోమీట‌ర్లు పూర్తి

YS Sharmila : మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పేరుంది. ఇదే గుణాన్ని ఆయ‌న త‌న‌యుడు సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుణికి పుచ్చుకున్నారు. మ‌రో వైపు తాను రాజ‌న్న బిడ్డ‌నేనంటూ ముందుకు వ‌చ్చారు వైఎస్ ష‌ర్మిల(YS Sharmila). వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.

ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా ష‌ర్మిల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌ధాస స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూనే ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇందుకోసం పాద‌యాత్ర‌తోనే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు శ్రీ‌కారం చుట్టారు. న‌వంబ‌ర్ 4తో వైఎస్ ష‌ర్మిల చేప‌ట్టిన యాత్ర 3000 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది.

ఇది ఓ రికార్డ్. అతి త‌క్కువ స‌మ‌యంలోనే వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో గుర్తింపు తెచ్చు కోగ‌లిగారు. ప్ర‌ధానంగా నియామ‌కాల విష‌యంలో నిల‌దీశారు. ఆపై మంత్రుల‌ను ఏకి పారేశారు. ఒకానొక స‌మ‌యంలో త‌న‌ను మ‌ర‌ద‌లితో పోల్చిన మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

ఆపై క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని క‌డిగి పారేశారు. ఇదే రాజ‌శేఖ‌ర్ రెడ్డి సార‌థ్యంలో తెలంగాణ‌ను పూర్తిగా నాశ‌నం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలంగాణ ఉద్య‌మ‌కారులు పెద్ద ఎత్తున ఇప్ప‌టికీ వ్య‌తిరేకిస్తారు. ఈ త‌రుణంలో ష‌ర్మిల ధైర్యంగా పాద‌యాత్ర‌కు దిగ‌డం విశేషం.

ఆమె చేప‌ట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా కొన్ని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ష‌ర్మిల బీజేపీకి ప‌ని చేస్తుంద‌ని కొంద‌రు ఆరోపిస్తే కాదు టీఆర్ఎస్ కోసం ప‌ని చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతూ వ‌చ్చిన ష‌ర్మిల ఇటీవ‌ల మునుగోడులో గెలిచేది గులాబీ అభ్య‌ర్థేనంటూ స్వ‌రం మార్చ‌డం విస్తు పోయేలా చేసింది. ఇక పాలేరు నుంచి తాను బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు ష‌ర్మిల‌.

Also Read : కాషాయం దేశానికి ప్ర‌మాదం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!