YS Sharmila Preethi : ప్రీతి మృతిపై విచార‌ణ జ‌రిపించాలి

వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

YS Sharmila Preethi : వ‌రంగ‌ల్ జిల్లా గిర్ని తాండాకు చెందిన ధ‌ర‌వాత్ ప్రీతి మృతి చెంద‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం క‌లిగించింది. నాలుగు రోజుల కిందంట ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డింది మెడికో . కేఎంసీలో పీజీ చ‌దువుతోంది. హైద‌రాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌జా సంఘాలు దీనికి బాధ్యులైన వారు ఎవ‌రో బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశాయి.

మెడికో ప్రీతి మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని, వెంట‌నే దోషులు ఎవ‌రో శిక్షించాల‌ని డిమాండ్ చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాచ‌రు. ప్రీతి మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఆమె మృతిపై కుటుంబంతో పాటు ప్ర‌జా సంఘాలు, ఇత‌ర సంస్థ‌లు డిమాండ్ చేస్తున్నాయ‌ని తాను కూడా వారితో ఏకీభవిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు మెడికో ధ‌రావ‌త్ ప్రీతి మృతి ఘ‌ట‌న‌పై సిట్టింగ్ జడ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila Preethi).

ప్రీతి కుటుంబీకులను ఆదుకోవాల‌ని వారికి న్యాయం చేయాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ప్రీతి బ్రెయిన్ ప‌ని చేయ‌డం పూర్తిగా ఆగి పోయింద‌ని నిమ్స్ వైద్యులు వెల్ల‌డించారు. ఇవాళ ప్రీతికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. గిర్ని తాండాలో పెద్ద ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తాత్సారం చేయొద్ద‌ని డిమాండ్ చేశారు . ఇదిలా ఉండగా మెడికో ప్రీతి సూసైడ్ కాద‌ని కావాల‌ని చంపేశారంటూ ఆరోపించారు.

Also Read : ప్రీతిని చంపిన సైఫ్ ను ఉరి తీయండి

Leave A Reply

Your Email Id will not be published!