YS Sharmila : పిల్ల‌ల స‌క్సెస్ ష‌ర్మిల ఖుష్

కొడుకు..కూతురు విద్య‌లో ప్ర‌తిభ

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న కొడుకు, కూతురు గురించి విశేషాలు తెలియ చేశారు. ఇద్ద‌రూ విద్యా ప‌రంగా స‌క్సెస్ అయ్యార‌ని, తాత పేరు నిల‌బెట్టారంటూ కొనియాడారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చూస్తే త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు.

YS Sharmila Praises her Children

త‌న‌తో పాటు త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌, భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణంలో ఫోటో దిగారు. ఈ సంద‌ర్బంగా వారితో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

త‌న ముందే పుట్టిన పిల్ల‌లు ఇవాళ పెరిగి పెద్ద‌య్యార‌ని, తాను ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా త‌మ‌తమ రంగాల్లో స‌క్సెస్ సాధించార‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). త‌న కొడుకు రాజా రెడ్డి అప్లైడ్ ఎక‌నామిక్స్ , ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించాడ‌ని తెలిపారు.

ఇదే స‌మ‌యంలో త‌న కూతురు అంజ‌లీ రెడ్డి బ్యాచ్ ల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ డిగ్రీ ప‌రంగా ఫైనాన్స్ డిగ్రీ అందుకుంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌, వైఎస్ విజ‌య‌మ్మ‌. మీ ఇద్ద‌రూ త్వ‌ర‌గా అభివృద్ది చెంద‌డం మ‌రింత బాధ్య‌త‌ను పెంచింద‌న్నారు.

స‌త్యాన్ని వెతికే ప్ర‌య‌త్నం చేయండి. మీ మీ రంగాల‌లో ఎందులో స్థిర ప‌డినా ఆ రంగంలో స‌క్సెస్ అయ్యేందుకు శ్ర‌మించాల‌ని దీవించారు ఇద్ద‌రూ.

Also Read : KA Paul : మోదీపై పోటీ చేస్తా – పాల్

Leave A Reply

Your Email Id will not be published!