YS Sharmila KTR : కేసీఆర్ ను జైల్లో ఎందుకు పెట్టొద్దు

కేటీఆర్ ను ప్ర‌శ్నించిన వైఎస్ ష‌ర్మిల

YS Sharmila KTR : అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వాళ్ల‌ను నెత్తికి ఎక్కించుకుంటారా లేక జైలుకు పంపిస్తారా ఆ మాత్రం మంత్రి కేటీఆర్ కు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను ఏకి పారేశారు. పొద్ద‌స్తమానం ఐటీ, అభివృద్ది అంటున్నారే త‌ప్పా ఎంత మందికి జాబ్స్ ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ లో చోటు చేసుకున్న అక్ర‌మార్కుల చిట్టా బ‌య‌ట‌కు వ‌చ్చినా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

త‌న తండ్రి కేసీఆర్ ను జైలుకు ఎందుకు పంపుతార‌ని కొడుకు కేటీఆర్ అమాయ‌కంగా అడుగుతున్నార‌ని ఇది త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). ప్రాజెక్టుల పేర్లు చెప్పి ల‌క్ష కోట్లు తిన్న అవినీతి ప‌రుడు కేసీఆర్ అని, ఉద్యోగాలు ఇవ్వ‌కుండా నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేలా చేసినందుకు సీఎంను త‌ప్ప‌క అరెస్ట్ చేయాల్సిందేన‌ని అన్నారు.

రుణ మాఫీ అని చెప్పి 31 ల‌క్ష‌ల మందిని మోసం చేసిన ఘ‌న‌డు కేసీఆర్ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పోడు ప‌ట్టాలు ఇస్తామ‌ని చెప్పి ఫారెస్ట్ ఆఫీస‌ర్ల చావుకు కార‌ణం మీ నాన్న కాదా అని కేటీఆర్ ను నిల‌దీశారు. సొంత ప్ర‌యోజ‌నాల కోసం 35 వేల ఎక‌రాల స‌ర్కార్ భూమిని అమ్మిన క‌బ్జా కోర్ , రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్ కాదా అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Also Read : Parveta Utsavam : వైభ‌వోత్స‌వం పార్వేట ఉత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!