YS Sharmila : ఇక విలీనమే మిగిలింది
వైఎస్ షర్మిల కామెంట్స్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిశానని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఢిల్లీలో షర్మిల మీడియాతో మాట్లాడారు. తనను అత్యంత ఆప్యాయంగా పలకరించారని తెలిపారు.
YS Sharmila Speaks
వారు తన పట్ల చూపించిన ప్రేమను తాను మరిచి పోలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్సార్. ఇవాళ ఆయన భౌతికంగా లేక పోవచ్చు. కానీ ఇప్పటికీ కోట్లాది ప్రజల్లో నిలిచే ఉన్నారని అన్నారు వైఎస్ షర్మిల.
తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా వద్దా అన్నది తేల్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు . అయితే ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మరో వైపు షర్మిల(YS Sharmila) రాకను కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు స్వాగతం పలుకుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు చెల్లెలు. జగన్ రెడ్డి నథింగ్..అది కూడా మ్యాటర్ ఆఫ్ టైమ్ అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తారా లేక ఏపీ రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషిస్తారా అన్నది హై కమాండ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మరోసారి షర్మిల సోనియాను కలవనున్నారు.
Also Read : Tummala Nageswar Rao : హస్తం గూటికి తుమ్మల..?