YS Sharmila : కాంగ్రెస్ హైకమాండ్ తో షర్మిల భేటీ
భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీకి
YS Sharmila : అంతా ఊహించినట్టే జరిగింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు దాదాపు సుగమమైంది. ఈ మేరకు శుక్రవారం హుటా హుటిన తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చర్చించనున్నారు. ఇందులో భాగంగా విలీన ప్రక్రియ, సీట్ల కేటాయింపుపై పెద్దలతో చర్చించనున్నారు.
YS Sharmila will Join Congress
గతంలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కీలకమైన ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేశారు. దురదృష్టవశాత్తు విమానం కూలిన ఘటనలో మృతి చెందారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల రీత్యా వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. బయటకు వచ్చాక స్వంతంగా పార్టీని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఊహించని రీతిలో సీట్లను సాధించారు. 3 ఏళ్ల కు పైగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అదే ఆయనను సీఎం పదవిలో కూర్చునేలా చేసింది.
దీంతో ఏపీలో ఉండాల్సిన తన సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) తెలంగాణలో పాగా వేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని కొత్తగా స్థాపించారు. ఆమె కూడా 3 వేల కిలోమీటర్ల మేరకు పైగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు. ప్రత్యేకించి కల్వకుంట్ల కుటుంబాన్ని దుమ్మెత్తి పోశారు. ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ఎండగట్టారు.
Also Read : Luna-25 Rocket : జాబిల్లి వద్దకు రష్యా రాకెట్