YS Sharmila : పాలనలో వైఎస్ బెస్ట్ కేసీఆర్ లాస్ట్
కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా స్కాంలే
YS Sharmila : తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఆనాడు దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు కూతురు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించింది. కల్వకుంట్ల ఫ్యామిలీపై నిప్పులు చెరిగింది. ఆనాటి వైఎస్ పాలన జనరంజకంగా ఉండేదని, కానీ ఇవాళ కేసీఆర్ సాగిస్తున్న పాలన దొర పాలనను తలపింప చేస్తోందంటూ ఆరోపించారు.
కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ఇవాళ తగ్గి పోయిందన్నారు. పేదలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). యువతను నిర్వీర్యం చేసిన ఘనత తమరిదేనని పేర్కొన్నారు. రైతు బంధు పేరుతో మోసం తప్ప ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఈ పథకం వల్ల పేద రైతులకు న్యాయం జరగడం లేదని, కేవలం ఆసాములు బాగు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
అవినీతికి, స్కాంలకు, కమీషన్లకు కేరాఫ్ కేసీఆర్ సర్కార్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ పాలనకు కేసీఆర్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాంకు పాల్పడ్డాడని, కూతురు కవిత లిక్కర్ స్కాంలో రాణి పాత్ర పోషించిందని, ఇక కొడుకు కేటీఆర్ రియల్ ఎస్టేట్ లో కింగ్ మేకర్ గా మారారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : CM YOGI : అతిక్ ఆక్రమణ స్థలంలో ఇళ్లు అప్పగింత