YS Sharmila : ప్రజలకేమో అప్పులు మీకేమో కోట్లు
లక్ష కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముమ్మాటికీ ఇది కుటుంబ పాలనే అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కలిగించాయి. రాష్ట్రం మొత్తం మీ కుటుంబం అయితే మరి మీ కుటుంబం మాత్రమే ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్ట గలిందంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం ఓరుగల్లుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె యాత్రకు ఘన స్వాగతం పలికించింది. ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. గడీలు, ఫామ్ హౌస్ లు, భవంతులు , విమానాలు కొనుక్కోవచ్చు మరి ప్రజలు ఎందుకు ఇంకా పేదరికంలో ఉండాలని ప్రశ్నించారు.
స్కాంలకు పాల్పడుతూ కమీషన్లతో వేల కోట్లు వెనకేసుకున్న మీకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనన్ని విరాళాలు ఒక్క బీఆర్ఎస్ కే ఎందుకు ఉన్నాయంటూ నిలదీశారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఒకటా రెండా ఏకంగా రూ. 800 కోట్లు ఉన్నాయని ఇదంతా ఎవరి సొమ్ము అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు కామ్ గా ఉన్నాయని , కేవలం తుతూ మంత్రంగా మాట్లాడటం తప్పితే ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఒక రకంగా ప్రతిపక్షం, అధికారపక్షం ఒక్కటేనన్న భావనలో ప్రజలు ఉన్నారని అన్నారు. ప్రజలకు ఏమో అప్పులు మీకేమో వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిల.
Also Read : తెలంగాణ పోలీసులకు అన్యాయం