YS Sharmila : వివేకా హత్యపై షర్మిల కామెంట్స్
ఆస్తుల కోసం చంప లేదు
YS Sharmila : ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి సీబీఐ రంగంలోకి దిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తోంది. ఎంపీకి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధర్మాసనం హైకోర్టు తీర్పుపై సీరియస్ అయ్యింది.
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ తరుణంలో వివేకానంద రెడ్డి హత్యపై సీరియస్ గా స్పందించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).
సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తన బాబాయిని ఆస్తుల కోసం చంప లేదని అన్నారు. ఎప్పుడో తన కూతురు, మా చెల్లెలు సునీతపై రాశాడని చెప్పారు వైఎస్ షర్మిల. ఇప్పటి వరకు కేవలం ఆస్తుల కోసమే హత్య జరిగిందన్న జగన్ రెడ్డి టీమ్ కు ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
అసలు తమ వంశంలో ఆస్తుల అంశమే చర్చకు రాలేదని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. ఒక వేళ చంపాలని అనుకుంటే వివేకానంద రెడ్డి కంటే ముందు సునీతను చంపాలని అన్నారు. చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు వైఎస్ షర్మిల.
Also Read : ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలి