YS Sharmila : దొర పాలనలో దగా పడ్డ తెలంగాణ
నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాద్ లోని అమర వీరుల స్తూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కసీఆర్ పై, రాష్ట్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో వెనకబడ్డదన్నారు. పూర్తిగా దగా పడిందని ధ్వజమెత్తారు. ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కాడని, నినాదాలను బొంద పెట్టిండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశయాలను మంట గలిపి , అక్రమార్కులు, అవినీతి పరులను అందలం ఎక్కించాడంటూ వైఎస్ షర్మిల(YS Sharmila) ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తన ఏటీఎంగా మార్చుకున్నాడని , ఒకటి కాదు వంద కాదు ఏకంగా రూ. 80 వేల కోట్లు దోచుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆ దోచుకున్న డబ్బుతో వచ్చే ఎన్నికల్లో దేశమంతటా పంచి గెలవాలని ప్లాన్ చేశాడంటూ ఎద్దేవా చేశారు. అయినా జనం ఆయనను నమ్మే స్థితిలో లేదరన్నారు వైఎస్ షర్మిల. దేశ రాజకీయాలను శాసించేంత డబ్బులు దోచుకున్నారంటూ మండిపడ్డారు.
మగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే నాలుగున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత కేసీఆర్ దని ధ్వజమెత్తారు. వందలాది మంది నిరుద్యోగాలు ఇక జాబ్స్ రావని ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.
Also Read : Suryaprabha Vahanam