YS Sharmila TS Govt : వైఎస్ బిడ్డను దాడి చేస్తే ఊరుకోను – షర్మిల
మంత్రి ఎర్రబెల్లి..ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సవాల్
YS Sharmila TS Govt : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా ఆమె రాష్ట్ర సర్కార్ పై మండిపడ్డారు. ఆమె గత కొంత కాలంగా రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేస్తూ ఠారెత్తిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ దూసుకు వెళుతున్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 3,500 కిలోమీటర్లకు పైగా సాగింది. ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల(YS Sharmila TS Govt) ప్రసంగించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు గంప గుత్తగా అక్రమాలకు పాల్పడుతున్నారని, అందినంత మేర కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల.
నేను చేపట్టే పాదయాత్రపై దాడి చేస్తామని పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారని దమ్ముంటే దాడి చేయాలని ఆమె సవాల్ విసిరారు మంత్రి, ఎమ్మెల్యేలకు. వైఎస్సార్ బిడ్డ ఎవరికీ భయపడదని అన్నారు. అవినీతి, అక్రమాలపై బరాబర్ ప్రశ్నిస్తామని హెచ్చరించారు.
కబ్జాలు, అక్రమాలపై ఆడవాళ్లు మాట్లాడ కూడదంటే ఎలా అని ప్రశ్నించారు. మీకు దమ్ముంటే ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఆడవాళ్లు అంటే అంత చులకనా అని అన్నారు. మిమ్మల్ని కన్నది ఆడవాళ్లు కారా అని నిలదీవారు వైఎస్ షర్మిల. దాడి చేస్తే ఊరుకుంటానా..ఇక్కడ ఉన్నది దమ్మున్న వైఎస్ఆర్ బిడ్డను. తిరిగి తిప్పి కొడతా అని హెచ్చరించారు వైఎస్ షర్మిల. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : తండ్రీ కొడుకులకు అంత సీన్ లేదు