YS Sharmila : హోంగార్డు చావుకు సర్కార్ దే బాధ్యత
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేసీఆర్ నియంత పాలన నిర్వాకం వల్ల నిండు ప్రాణం బలై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Sharmila Comments Viral
ఇప్పటి వరకు 5 లక్షల కోట్లు అప్పులు చేశాడని, ఓ వైపు బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
నగరంలోని పాత బస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ కు సకాలంలో జీతం రాక పోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు.. జీతాలు పెంచుతమని ప్రగల్భాలు పలికారు.. హోం గార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. \ హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇక మీ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలని నిలదీశారు వైఎస్ షర్మిల.
Also Read : BUS Fire : డ్రైవర్ అప్రమత్తం తప్పిన ప్రమాదం