YS Sharmila : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతా

మాది నిజ‌మైన తెలంగాణ పార్టీ

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కొంద‌రు కావాల‌ని త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రు ఎక్కడికైనా వెళ్ల వ‌చ్చ‌ని, పోటీ చేసేందుకు హ‌క్కు ఉంద‌ని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు మౌనంగా ఉండ‌డం దేనికి సంకేతం అనుకోవాల‌ని అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంటే ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీలు ఏం చేస్తున్నాయ‌ని నిల‌దీశారు. తమ పార్టీ ఒక్క‌టే అలుపెరుగ‌ని రీతిలో పోరాటం చేస్తోంద‌న్నారు. త‌మ‌ను అరెస్ట్ చేసినా, కేసులు న‌మోదు చేసినా ముందుకే సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

ఆమె టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే రాజ‌కీయంగా ఎదుర్కోవాలే త‌ప్పా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం త‌న‌కు త‌గ‌ద‌ని పేర్కొన్నారు. తాను వ‌చ్చాకే రాష్ట్రంలో బీఆర్ఎస్ లో క‌ద‌లిక ఏర్ప‌డింద‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌.

తెలంగాణ కోసం అంకిత‌మై, తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ప్ర‌క‌టించారు. జై తెలంగాణ అనే ద‌మ్ము కేసీఆర్ కు , రేవంత్ కు, బండి సంజయ్ కు లేద‌న్నారు. సోనియాకు , మోదీకి కూడా లేద‌న్నారు. కేవ‌లం త‌మ పార్టీకి మాత్ర‌మే ఉంద‌న్నారు.

Also Read : AUS vs IND WTC Final 2023

Leave A Reply

Your Email Id will not be published!