YS Sharmila : దొర పాలనలో రాష్ట్రం ఆగమాగం
వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలు ఓ వైపు సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే మరో వైపు సీఎం కేసీఆర్ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలంగాణ పేరుతో ఇప్పటి వరకు మోసం తప్ప ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ సమాజం యావత్తు తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వాటన్నింటిని తుంగలో తొక్కారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల(YS Sharmila).
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఈరోజు వరకు ఏ ఒక్క వర్గానికి మేలు చేకూర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి పాలనను అస్తవ్యస్తంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఉన్న సెక్రటేరియట్ ను కూల్చమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఉపాధి లేక నిరుద్యోగులు , కూలీ దొరక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిజైన్లు మార్చడం, అంచనాలు పెంచడం, కోట్లు దండు కోవడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటుగా మారిందని ఆరోపించారు వైఎస్ షర్మిల.
ఆనాడు తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రాష్ట్రానికి మేలు జరిగిందన్నారు. కానీ కేసీఆర్ వచ్చాక అన్నీ బంద్ పెట్టిండు అంటూ మండిపడ్డారు. విద్య, వైద్యం పేదలకు దూరమైందని ఇవాళ బతకడమే తెలంగాణలో గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. దొర పాలనలో రాష్ట్రం ఆగమాగమైందన్నారు.
Also Read : కూల్చేస్తే కాళ్లు..చేతులు విరిచేస్తాం