YS Sharmila : ద‌ళిత న్యాయ‌వాదిపై దాడి దారుణం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. న‌డి రోడ్డుపై ద‌ళిత న్యాయ‌వాది కారు అద్దాలు ప‌గల‌గొట్ట‌డం, ర‌క్తం వ‌చ్చేలా దాడి చేయ‌డం, చంపేస్తామంటూ బెదిరించిన బీఆర్ఎస్ నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఇది బందిపోట్ల‌కే సాధ్య‌మ‌ని పేర్కొన్నారు. ద‌ళిత న్యాయ‌వాదిపై దాడి దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర స‌మితి అని ఊరికే అన‌లేద‌ని మండిప‌డ్డారు.

ద‌ళిత బంధు అక్ర‌మాల‌ను ఎత్తి చూపిన అడ్వ‌కేట్ యుగేంద‌ర్ బీఆర్ఎస్ గూండాల దాడిని తాము ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ద‌ళితులపై గ‌త కొంత కాలం నుంచి దాడులు కొన‌సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇందు కోసం త‌మ పార్టీ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

బంది పోట్ల రాష్ట్ర స‌మితి అంటే త‌న‌పై హుటాహుటిన కేసు న‌మోదు చేయించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. దాడికి పాల్ప‌డిన నేత‌ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌న్న కేసీఆర్ దానిని తుంగ‌లో తొక్కాడ‌ని , ద‌ళిత బంధు అంటూ ఇప్పుడు స‌రికొత్త నాట‌కానికి తెర లేపాడంటూ ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్ర‌తిప‌క్షాల‌కు పోరాడే హ‌క్కు లేద‌న్నారు. మీడియాకు స్వేచ్చ లేకుండా పోయింద‌న్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం ఆమె స్పందించారు.

Also Read : Alok Mohan DG IGP

Leave A Reply

Your Email Id will not be published!