YS Sharmila : దాడులకు భయపడను సీఎంను వదలను
ఖాకీలు గులాబీ నిక్కర్లు వేసుకోండి
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె చొప్పదండి నియోజకవర్గంలోని అరుణకొండలో మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించరు. అంతకు ముందు మీడియాతో వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రసంగించారు.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. తాము టీఆర్ఎస్ సాగిస్తున్న అవినీతి పాలనను ప్రశ్నిస్తున్నామని అందుకే తట్టుకోలేక తమ వారిపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నేతలకు, ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
వాళ్లిచ్చే పైసలకు అమ్ముడు పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలా అనుకుంటే పోలీసుల జాబ్స్ వదిలేసి గులాబీ నిక్కర్లు వేసుకుంటే బాగుంటుందని మండిపడ్డారు. ఓ కేబినెట్ మంత్రి నన్ను మరదలితో పోల్చాడని ఆయనపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని , కాళేశ్వరంలో చోటు చేసుకున్న అవినీతి గురించి ఒక్క వైఎస్సార్ టీపీ నే పోరాడుతోందని ప్రశ్నించాల్సిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఎందుకు చేయడం లేదని తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు.
తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని తల వంచే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యిందన్నారు. దాడులు చేయడం కాదు ముందు అభివృద్ది ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : కాషాయంపై ఫైర్ బ్రాండ్ కన్నెర్ర