YS Sharmila : కేసీఆర్ ప్ర‌చారానికి ఎక్కువ ప‌నికి త‌క్కువ‌

నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్ ష‌ర్మిల

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. క‌ష్టం , పైస‌లు ప్ర‌జ‌ల‌కు చెందితే ప్ర‌చారం మాత్రం కేసీఆర్ కేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. పాల‌మూరు జిల్లా ప్ర‌జ‌ల క‌న్నీళ్ల‌ను చూసి దివంగ‌త వైఎస్ నీళ్లు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని గుర్తు చేశారు. త‌ట్టెడు మ‌ట్టి కూడా మోయ‌ని సీఎం కేసీఆర్ తానే జ‌ల‌క‌ళ తెచ్చిన‌ట్లు చెప్పుకోవ‌డం సిగ్గు చేట‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల‌.

తానే అప‌ర భ‌గీర‌థుడు అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. సొమ్ము ప్ర‌జ‌ల‌ది అయితే సోకు కేసీఆర్ చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ప‌డావు ప‌డిన భూముల‌లో కృష్ణా జలాలు పారించిన ఘ‌న‌త ఎవ‌రిదో చ‌ర్చ‌కు రావాల‌ని వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) సవాల్ చేశారు. ఆనాడు వైఎస్సార్ జ‌ల య‌జ్ఞం కింద వేసిన పునాదులే ఇవాళ 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అందుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

క‌ల్వ‌కుర్తి ద్వారా 4 లక్ష‌ల ఎక‌రాలు, భీమా కింద 2 ల‌క్ష‌ల ఎక‌రాలు, నెట్టెంపాడుతో 2 ల‌క్ష‌ల ఎక‌రాలు, కోయిల్ సాగ‌ర్ ప్రాజెక్టు కింద 60 వేల ఎక‌రాలు, గ‌ట్టు, తుమ్మిళ్ల‌, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజ‌ర్వాయ‌ర్లకు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త త‌మ తండ్రి దివంగ‌త సీఎం వైఎస్సార్ కు ద‌క్కుతుంద‌న్నారు. మ‌రి మీ ప‌దేళ్ల హ‌యాంలో ఒక్క ఎక‌రాకైనా అద‌నంగా సాగు నీరు ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. పాల‌మూరు – రంగారెడ్డి పేరు చెప్పి రూ. 35 వేల కోట్లు కాజేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : RS Praveen Kumar : కేసీఆర్ పాల‌న‌లో స‌ర్పంచ్ లు ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!