YS Sharmila : అమ‌రుల త్యాగాలు క‌ల్వ‌కుంట్ల భోగాలు

నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అమ‌రుల త్యాగాల‌తో తెలంగాణ ఏర్ప‌డితే క‌ల్వ‌కుంట్ల కుటుంబం భోగాలు అనుభ‌విస్తోందంటూ ఎద్దేవా చేశారు. వీళ్ల వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌ని చెప్ప‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఎంద‌రో బ‌లిదానాలు చేసుకుంటే వ‌చ్చిన తెలంగాణ‌లో అంతా త‌న వ‌ల్ల‌నే రాష్ట్రం ఏర్ప‌డింద‌ని ప‌దే ప‌దే చెప్ప‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. తెలంగాణ చ‌రిత్ర అంటే కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబం మాత్ర‌మేనా అని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల‌.

1200 మంది అమ‌రుల‌య్యార‌ని తెలంగాణ కోసం. వారి వ‌ల్ల ఏర్ప‌డిన తెలంగాణ‌ను ఇప్పుడు క‌ల్వ‌కుంట్ల కుటుంబం అనుభ‌విస్తోంద‌ని ఆరోపించారు. ఏనాడైనా స‌కల జ‌నుల స‌మ్మెలో పాల్గొన్నారా అని ప్ర‌శ్నించారు. దొంగ దీక్ష‌లతో , మాయ మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చ‌రిత్ర నీది కాదా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మ నినాదంతో సీఎం పీఠం ఎక్కిన మిమ్మ‌ల్ని చ‌రిత్ర క్ష‌మించ‌ద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). అమ‌ర‌వీరుల త్యాగాల‌ను గుర్తించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు . త్యాగ‌ధ‌నుల ఊసే లేకుండా చేసిన ఘ‌న‌త నీది కాదా అని మండిప‌డ్డారు.

కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో అమ‌రుల‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్ప‌టికీ ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు. క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్న నీకు త్వ‌ర‌లోనే బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Delhi Govt School : ఢిల్లీ ప్ర‌భుత్వ స్కూల్ రికార్డ్

 

Leave A Reply

Your Email Id will not be published!