YS Sharmila : కేసీఆర్ రుణ మాఫీ అబ‌ద్దం – వైఎస్ ష‌ర్మిల

నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని గురించి ఊసెత్త‌డం లేద‌ని ఆరోపించారు. మాయ మాట‌లు చెప్ప‌డం, ఓట్లు వేయించ‌డం ఆ త‌ర్వాత మ‌రిచి పోవ‌డం, చెప్పిన దానిని అన‌లేద‌ని బుకాయించ‌డం కేసీఆర్ కు మొద‌టి నుంచి అల‌వాటేన‌ని ఎద్దేవా చేసింది.

భార‌త రాష్ట్ర స‌మితి పాల‌న‌లో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అన్న‌దాత‌లు 9 వేల మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). రాష్ట్ర బ‌బ్జెట్ లో 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 26 వేల కోట్లు వ్యవ‌సాయానికి కేటాయించార‌ని తెలిపారు. కానీ సీఎం దొర ఖ‌ర్చు చేసింది కేవ‌లం రూ. 1200 కోట్లు మాత్ర‌మేన‌ని ఆరోపించింది.

గ‌తంలో మ‌హా నాయకుడు దివంగత రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏడాది లోనే రుణ మాఫీ చేశార‌ని గుర్తు చేశారు. ఇన్నేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా కూడా మాఫీ చేసిన పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల‌. మాట త‌ప్పితే త‌ల న‌రుక్కుంటాన‌ని అన్నార‌ని, ఇప్పుడు న‌రుక్కుంటారా అని నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే రైతుల‌కు సంబంధించిన రుణాల‌ను మాఫీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Punjab Govt : పంజాబ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!