YS Sharmila : దొరకు బడుల కంటే బార్ల పైనే ధ్యాస
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ద పేద పిల్లల చదువుపై లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తాగు, తాగుపించు ఇదే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని మండిపడ్డారు షర్మిల. కేసీఆర్ కు బడులను బాగు చేయడం కంటే బార్లు ఏర్పాటు చేయడంలో ఫోకస్ పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
తాగుబోతుల మీద ఉన్న శ్రద్ధ , ప్రేమ ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేయడంలో దృష్టి పెట్టడం లేదంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). విద్యార్థుల కంటే రాష్ట్రంలో మందు బాబులే ఎక్కువగా ఉన్నారంటూ ఆవేదనవ్యక్తం చేశారు. విద్య అభివృద్దిపై దొర చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదన్నారు. కేసీఆర్ మనువడు పట్టా అందుకుంటే పేదల పిల్లలు ఇవాళ రోడ్లపై ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
రూ. 3,500 కోట్లతో మన మూరు మన బడి అంటూ ఊదర గొట్టారని ఎద్దేవా చేశారు. ఈ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమాన్ని కాపీ కొట్టారంటూ సెటైర్ వేశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. వసతి సౌకర్యాలను కల్పించడంలో శ్రద్ధ వహించడకుండా కమీషన్లపైనే ఫోకస్ పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.
Also Read : Ronald Rose : జీహెచ్ఎంసీ కమిషనర్ గా రోనాల్డ్ రోస్
