YS Sharmila : సీఎం..ఎన్నాళ్లిలా మోసం – షర్మిల
కేసీఆర్ పై భగ్గుమన్న వైసీపీటీపీ ఛీప్
YS Sharmila : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఇలా ఎంత కాలం తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కాలం వెళ్లదీస్తారంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. దొరకు ఎన్నికలప్పుడే అన్నీ గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు.
YS Sharmila Slams CM KCR
ఓ వైపు రైతులు ఎరువులు, మందులు దొరకక అవస్థలు పడుతుంటే బంగారు తెలంగాణ అంటూ బాకాలు ఊదుతూ ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. మాటలు తప్ప చేతలు శూన్యమన్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం ఇప్పుడిప్పుడు ప్రగతి భవన్ కు వస్తున్నారంటూ సెటైర్ వేశారు.
ఎవరి కోసం సీఎంగా ఉన్నారో ఆయనకే తెలియాలన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం సంక్షేమ పథకాల పేరుతో కాలం వెళ్లిబుచ్చడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు వైఎస్ షర్మిల(YS Sharmila). దేశంలో ఎవరూ చేయని విధంగా 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.
ప్రజలు కేసీఆర్ పాలన పట్ల సంతోషంగా లేరని ఆవేదన చెందారు. రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రజల్ని హెచ్చరించారు వైఎస్ షర్మిల. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని, యువతీ యువకుల ఆశలపై నీళ్లు చల్లిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
Also Read : DG Tech MD Khan Vilker : స్కాం అబద్దం అరెస్ట్ అన్యాయం