YS Sharmila : టీఎస్పీఎస్సీ తండ్రీ కొడుకుల జేబు సంస్థ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల విషయంపై హైకోర్టు చీవాట్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఎలాంటి అనుభవం, అర్హత లేని వాళ్లకు ఎలా సభ్యులుగా నియమిస్తారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల. కోర్టు తీర్పుతో టీఎస్పీఎస్సీ అనేది తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ ల జేబు సంస్థ అని తేలి పోయిందన్నారు.
అయిన వాళ్లకు, తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకు పదవులు కట్టబెట్టారని, తీరా ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. చట్ట బద్దమైన సంస్థను నిర్వీర్యం చేసిన ఘనత తండ్రీకొడుకులకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే టాప్ ఐటీకి కేరాఫ్ అని చెప్పే చిన్న దొర ఎందుకు నోరు విప్పడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఓ వైపు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రభుత్వం తనకు అనుకూలంగా నియమించిన దర్యాప్తు సంస్థ సిట్ ఇప్పటి వరకు ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు దర్యాప్తు చేస్తారని నిలదీశారు. ఎవరికి లబ్ది చేకూర్చేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఈ మొత్తం స్కాంకు సంబంధించి సిట్ తో కాకుండా సీబీఐతో తండ్రీ, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ లను విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడైతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు వైఎస్ షర్మిల.
Also Read : Rahul Mass Leader : రాహుల్ మాస్ లీడర్