YS Sharmila : కేసీఆర్ కు సూట్ కేస్ గిఫ్ట్
రేపటితో తెలంగాణకు విముక్తి
YS Sharmila : హైదరాబాద్ – గత పదేళ్లుగా రాక్షస పాలన సాగించిన నయా నిజాం నవాబు సీఎం కేసీఆర్ ఇక దుకాణం పూర్తయిందని , ఇక మూసు కోవడం మాత్రమే మిగిలి ఉందని ఎద్దేవా చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila). శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.
YS Sharmila Gift Viral
దొర అహంకారానికి నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరిగిందన్నారు. తనను అమ్ముడు పోయానని అనరాని మాటలు అన్నారని, అయితే తనను టార్గెట్ చేస్తూ , దూషించిన వారు ఇవాళ నవాబు చెంతన చేరారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.
తెలంగాణ ప్రజలకు చెందిన ఆస్తులను గంప గుత్తగా దోపిడీకి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు క్షమించ బోరంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఇన్నాళ్లుగా చేసిన మోసాలకు తెర దించే సమయం ఆసన్నమైందని జోష్యం చెప్పారు షర్మిల.
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తాను బలపర్చిన కాంగ్రెస్ పార్టీకి కనీసం 80 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమె సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ బై బై అంటూ సూట్ కేసును రిటర్న్ గిఫ్ట్ పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : DK Shiva Kumar : డీకేతో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ భేటీ