YS Sharmila : తాలిబాన్ల రాజ్యం ఖాకీలు దారుణం – ష‌ర్మిల‌

డీజీపీని క‌లిసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో తాలిబాన్ల రాజ్యం కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉన్న‌ది నాయ‌కులు కాద‌ని వాళ్లు తాలిబాన్లు అని మండిప‌డ్డారు. వాళ్లు బెదిరిస్తే తాము భ‌య‌ప‌డ‌మ‌న్నారు.

త‌మ పాద‌యాత్ర‌ను ఎక్క‌డైతే ఆపాల‌ని అనుకున్నారో అక్క‌డి నుంచి తిరిగి ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఉద‌యించే సూర్యుడిని ఎవ‌రూ ఆప‌లేరని..వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆప‌లేమ‌న్నారు. కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌తిరోజూ ఎత్తి చూపుతామ‌ని ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. గ‌తంలో సీఎం ఇచ్చిన హామీల‌ను ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌న్నారు.

కేసీఆర్ ను , ఆయ‌న ఫ్యామిలీని నిల‌దీస్తామ‌న్నారు. కేసీఆర్ కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటే , బిడ్డ క‌విత మ‌ద్యం వ్యాపారంలో కింగ్ మేక‌ర్ గా మారింద‌ని , కొడుకు కేటీఆర్ రియ‌ల్ ఎస్టేట్ లో అందినంత మేర దోచుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

టీఆర్ఎస్ లో ఉద్య‌మ‌కారులు లేర‌ని గూండాలు, దొర‌లు, అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని వాపోయారు. తెలంగాణ స్టేట్ పోలీస్ గా కాకుండా తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌క‌ర్త‌లుగా ప‌ని చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిల‌.

నాపై విచార‌ణ చేస్తే తాను రెడీగా ఉన్నాన‌ని అన్నారు. తాను సీఎంపై, కూతురు, కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల‌పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. తాలిబాన్ల రాజ్యం..ఖాకీలు దారుణ‌మన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 2 లక్ష‌లు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం ఏమైనా భ‌ర్తీ చేశారా అని నిల‌దీశారు.

Also Read : క‌విత‌..బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!