YS Sharmila : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అహో ఒహో అంటూ కేసీఆర్ గొప్పలు చెప్పారని, ఇవాళ నీళ్లు ఎవరికి అందుతున్నాయో చెప్పాలన్నారు. కష్ట కాలంలో ఆదుకోవాల్సిన కాళేశ్వరం ఎవరిని ఆదుకుంటుందో చెప్పాలన్నారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్నా ఎత్తి పోయాల్సిన బాహుబలి మోటార్లు దొర నిద్ర పోయినట్లుగానే పని చేయడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila).
వారంలో 21 టీఎంసీలు నీటిని తోడాల్సి ఉండగా మోటార్లు కేవలం 4 టీఎంసీలకే పరిమితం అయ్యాయని దీనిపై కేసీఆర్ ఏం చెబుతారంటూ ప్రశ్నించారు . 17 మోటార్లకు గాను 10 మోటార్లు సరిగా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. కోటి ఎకరాలకు నీరిస్తామని చెప్పిన దొర కనీసం 10 వేల ఎకరాలకు కూడా సాగు నీరు అందడం లేదని ఆరోపించారు.
దేని కోసం ఎవరి కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు వైఎస్ షర్మిల. విద్యుత్ ఉత్పత్తిలో సగం కరెంట్ వాడి ఏ ప్రాజెక్టు నింప లేదన్నారు. లక్ష ఖర్చు చేసినా ఎకరా తడవని పరిస్థితి నెలకొందన్నారు.
Also Read : Ponguleti Srinivas Reddy : కేసీఆర్ గద్దె దిగే దాకా పోరాటం
