YS Sharmila : దళిత ద్రోహి కేసీఆర్ – షర్మిల
వైఎస్సార్ టీపీ చీఫ్ కామెంట్స్
YS Sharmila : తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. శుక్రవారం దళిత బంధు పథకంలో అక్రమాలను నిరసిస్తూ చేపట్టిన దీక్షకు మద్దతుగా నిలిచారు గజ్వేల్ నుంచి తరలి వచ్చిన తీగుల్ గ్రామస్థులు. షర్మిలకు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడారు. కేసీఆర్ ఇప్పటికైనా మారాలన్నారు.
YS Sharmila Comments on KCR
పేదల కన్నీళ్లు చూసైనా పథకాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధుపై సమీక్ష చేపట్టాలని , ఎమ్మెల్యేల దోపిడీని అరికట్టాలని కోరారు. ఇప్పటి వరకు ఇచ్చిన దళిత బంధులో జరిగిన అవినీతి ఎంతో తేల్చాలన్నారు షర్మిల(YS Sharmila). ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు . ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయక పోతే తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామన్నారు .
గజ్వేల్ ప్రజల సమస్యలు తెలుసు కునేందుకు వెళుతున్న తమను గృహ నిర్బంధం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు షర్మిల. మీ నియోజకవర్గంలోనే దళిత బంధు ఇలా ఉంటే తెలంగాణలో ఇంకెలా ఉంటుందో ఆలోచించు కోవాలన్నారు.
తమ అనుచరులకే దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో 17 లక్షల మంది దళితులు ఉంటే కేవలం 28 వేల మందికే ఇచ్చారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
Also Read : Rahul Gandhi : కంట తడి పెట్టించిన రామేశ్వర్ జీ