YS Sharmila : కాళేశ్వరం మోసం మోదీ మౌనం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఎవరిని కాపాడేందుకు మీరు పార్టీని కొనసాగిస్తున్నారంటూ నిలదీశారు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలో లేదని స్పష్టం చేశారు. తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
YS Sharmila Comment on Kaleshwaram
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జల శక్తి సంస్థ డ్యామ్ సేఫ్టీ టీం కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కు జరిగిన డ్యామేజ్ ను కుండ బద్దలు కొట్టిందని, అయినా ఎందుకు ఇంకా ఆలశ్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్ షర్మిల(YS Sharmila) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలు ఇకనైనా మారాలని , మళ్లీ ఓటు వేసి మోస పోవద్దంటూ కోరారు.
కేంద్ర సర్కార్ , మంత్రులు సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చెప్పినా ప్రధాన మంత్రి స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిటికేస్తే చాలు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే సత్తా కలిగిన బీజేపీ సర్కార్ కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో ఎందుకు వెనక్కి వెళుతోందంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
Also Read : Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు