YS Sharmila Slams : సజ్జల కామెంట్స్ షర్మిల కౌంటర్
ఏపీ పరిస్థితి చూసుకుంటే బెటర్
YS Sharmila Slams : హైదరాబాద్ – అన్నా, చెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగినట్లుంది. ఏపీ సర్కార్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. తాజాగా ఆయన వైఎస్ షర్మిల గురించి కామెంట్స్ చేశారు.
YS Sharmila Slams Sajjala
దీనిపై సీరియస్ గా స్పందించారు సోమవారం వైఎస్ షర్మిల. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ముందు సజ్జల రామకృష్ణా రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను పార్టీ పెట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో షర్మిలకు(YS Sharmila) ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించారని ఇప్పుడు తాను పోటీ చేసే విషయంపై ఆయన వ్యాఖ్యలు చేయడం దారుణంగా ఉందన్నారు వైఎస్ షర్మిల.
ముందు సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పాలన్నారు . ఏపీ పరిస్థితిపై అక్కడి వైసీపీ నాయకులు ఆలోచిస్తే మంచిదని సూచించారు. తెలంగాణ రాష్ట్రం గురించి, ఇక్కడి పరిస్థితి విషయంపై వాళ్లకు సంబంధం లేదన్నారు వైసీపీ తెలంగాణ పార్టీ చీఫ్.
Also Read : AP CM YS Jagan : బస్సు ప్రమాదం విచారణకు ఆదేశం