YS Sharmila Tribute : మహానేతకు మరణం లేదు – షర్మిల
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు
YS Sharmila Tribute : లోకంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు దివంగత మహా నాయకుడు , మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికే ఉంటారని అన్నారు ఆయన కూతురు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జూలై 8న వైఎస్సార్ జయంతి. ఈ సందర్బంగా కడప జిల్లాలోని ఇడుపుల పాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. భార్య వైఎస్ విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిల, ఆమె కూతురు, కొడుకు సైతం వైఎస్సార్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికీ ఎల్లప్పటికీ పేదల గుండెల్లో పదిలంగా వైఎస్సార్ నిలిచే ఉంటారని పేర్కొన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila). జీవిత కాలమంతా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం తర తరాలకు ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర సీఎం చేయని విధంగా సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చారని తెలిపారు.
కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించామని , ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు వైఎస్సార్ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.
Also Read : Arvind Kejriwal : విద్యతోనే గౌరవం వికాసం – కేజ్రీవాల్
