YS Sharmila Vijayamma : రెండు చోట్ల త‌ల్లీకూతుళ్లు పోటీ

వైఎస్సార్టీపీ కార్య‌వ‌ర్గంలో నిర్ణ‌యం

YS Sharmila Vijayamma : హైద‌రాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిన్న‌టి దాకా విలీనం చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు సంబంధించి ప‌లుమార్లు ష‌ర్మిల ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. పార్టీని విలీనం చేస్తే త‌న‌కు ఎంపీ, త‌న త‌ల్లికి ఎమ్మెల్యే సీటు తో పాటు జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీకి స‌మానంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టారు.

YS Sharmila Vijayamma Viral

దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చించింది ఏఐసీసీ. కానీ ఎందుక‌నో ష‌ర్మిల(YS Sharmila) గొంతెమ్మ కోర్కెల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో పార్టీ విలీన ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలోని 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది.

తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు రానున్నాయి. దీంతో ఒప్పంద ప్ర‌క్రియ‌కు భంగం వాటిల్ల‌డంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బ‌రిలోకి దిగేందుకు నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ నేత‌లు, ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు.

త‌ల్లీ బిడ్డ‌లు విజ‌య‌మ్మ‌, వైఎస్ ష‌ర్మిల‌లు ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారు. ఆ ఇద్ద‌రు పాలేర‌, మిర్యాల‌గూడ నుంచి పోటీలో ఉండ‌నున్నారు.

Also Read : CM KCR : సీఎం కేసీఆర్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!