YS Sharmila : అడ్డుకున్న పోలీసులకు షర్మిల ఆశీర్వాదం
గజ్వేల్ పర్యటనకు వెళుతుండగా నో పర్మిషన్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఆమె తెలంగాణ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి దాకా భారత రాష్ట్ర సమితిని, కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తాజాగా గజ్వేల్ టూర్ కోసం బయలు దేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను వెళ్లనీయలేదు. దీనిపై షర్మిల సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఖాకీల రాజ్యం నడుస్తోందన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగ పాలన అమవులతోందన్నారు.
YS Sharmila Welcomes Police
తనను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా, పోలీసులకు విస్తు పోయేలా ఆహ్వానం పలికారు. తానే ఇంట్లోకి వెళ్లి హారతి పల్లెంతో ముందుకు వచ్చారు. మీరు డ్యూటీ సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ మేరకు వైఎస్ షర్మిల(YS Sharmila) వారిని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్ లో హల్ చల్ అవుతున్నాయి.
ప్రజల కోసం గొంతు వినిపించడం నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. పోలీసుల ప్రవర్తన ఇబ్బందికరంగా మారిందన్నారు. వారు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారని తనకు వారి పట్ల ఎలాంటి కోపం లేదన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్.
మొత్తంగా ఎవరికీ రాని ప్రచారం వైఎస్ షర్మిలకు మాత్రం ఉచితంగా వస్తోంది. ఇదేనేమో రాజకీయం అంటే.
Also Read : Pawan Kalyan : బాధితులకు జనసేనాని భరోసా