YS Vijayamma : బిడ్డ ప్రచారానికి తల్లి రథసారథి
వైసీపీకి విజయమ్మ గుడ్ బై
YS Vijayamma : ఊహించని రీతిలో వైస్సార్సీపీ పార్టీ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ విజయమ్మ(YS Vijayamma). శుక్రవారం వైసీపీ ప్లీనరీ సమావేశాలలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై యుద్దం ప్రకటిస్తూ పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు విజయమ్మ.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఊహించని రీతిలో విజయమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బిడ్డ చేస్తున్న రాజకీయ ప్రచారానికి తాను తోడుగా ఉండబోతున్నట్లు చెప్పారు.
సోదరుడి పార్టీకి ఆమె ఇంత కాలం పాటు గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వచ్చారు. ఐదేళ్ల తర్వాత గుంటూరులో ఆమె తనయుడు , పార్టీ చీఫ్ , ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్లీనరీలో ప్రసంగం ముగియగానే ఈ ప్రకటన వెలువడింది.
తెలంగాణ ప్రజల కోసం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్న కలలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు విజయమ్మ(YS Vijayamma). కుటుంబంలో గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న ప్రచారానికి తెర దించారు.
ఈ సందర్బంలో తాను గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాము ఎవరం విడి పోలేదని అంతా కలిసి కట్టుగా ఉన్నామని స్పష్టం చేశారు విజయలక్ష్మి.
ఇదిలా ఉండగా విభజన, నీటి పంపకాల వివాదాల విషయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలు భిన్నమైన వైఖరిని కలిగి ఉంటాయని తనకు అర్థమైందన్నారు.
Also Read : ప్రజల ఆశీర్వాదం కొండంత బలం – జగన్