YS Viveka Case SC : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు

YS Viveka Case SC : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిని మార్చాలని ఇటీవల చెప్పిన కోర్టు తాజాగా మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీం(YS Viveka Case SC) ఆదేశించింది.

ఈ కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని పేర్కొంది. అలాగే 6 నెలల్లో కోర్టు ట్రయిల్ ప్రారంభించాలి. లేదంటే నిందితుల రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపింది.

ఈ క్రమంలో దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ కేసులో నిందితునిగా ఉన్న శివశంకర్ భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా సీబీఐ దర్యాప్తుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తులో విచారణ అధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని గత విచారణలో ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న రామ్ సింగ్ ను కొనసాగుతున్నట్లు సీబీఐ పేర్కొంది.

Also Read : జీ-20 ప్రతినిధులకి సీఎం జగన్ అదిరిపోయే విందు

Leave A Reply

Your Email Id will not be published!