YSR Rythu Bharosa : కౌలు రైతులకు ఆసరా రైతు భరోసా
రూ. 120.75 కోట్ల ఆర్థిక సాయం ఖాతాల్లో జమ
YSR Rythu Bharosa : ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు దారు హక్కు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46, 324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలి విడతగా రూ. 7,500 చొప్పున రైతు భరోసా సాయంగా రూ. 109.74 కోట్లు జమ చేసింది.
YSR Rythu Bharosa will be Released
అంతే కాకుండా పంట నష్ట పోయిన 11,373 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 11.01 కోట్లతో కలిపి మొత్తం రూ. 120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి ఇవాళ జమ చేయనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan).
ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోపు పరిహారం అందజేస్తామని గతంలో మాటిచ్చారు సీఎం. ఆ మేరకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 52,57,263 మంది రైతులకు కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రూ. 3,93 కోట్లు అందజేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ 50 నెలల్లో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించిన సాయం రూ. 31,005 కోట్లు కావడం విశేషం.
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం రైతన్నలకు మూడు విడతల్లో సాయం అందజేస్తోంది. పంట వేసే సమయంలో రూ. 7,500 , కోత సమయంలో రబీ అవసరాల కోసం రూ. 4,000 , పంట ఇంటికి వచ్చే సమయంలో రూ. 2,000 జమ చేస్తోంది.
Also Read : Twitter New Features Comment : మస్క్ మస్త్ ట్విట్టర్ జోష్