YSRCP Slams : పవన్ పై వైసీపీ షాకింగ్ కామెంట్స్
గతం మరిచి పోతే ఎలా ప్యాకేజీ స్టార్
YSRCP Slams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ(YSRCP) ప్రభుత్వంపై, సీఎం జగన్ రెడ్డిపై , మంత్రులపై, ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. జగన్ గురించి చెబితే చెవుల్లోంచి రక్తం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు బాగా తెలుసని పేర్కొంది. ఆయన ఎవరి పక్షం వహిస్తున్నాడో అర్థం చేసుకున్నారని తెలిపింది. కేవలం చంద్రబాబు నాయుడి మెప్పు కోసం, ఆయనకు లబ్ది చేకూర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించింది.
ఆపై శ్రీకాంత్ భార్యతో దెబ్బలు తిన్న విషయం మరిచి పోయావా , పార్వతి మెల్టన్ కు కడుపు ఎవరు చేశారో గుర్తుకు లేదా , అబార్షన్ చేయించేందు కోసం అర్ధరాత్రి అమీర్ పేట్ లో డయాగ్నసిస్ సెంటర్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పంపించ లేదా , జూబ్లీ హిల్స్ లో భూమి వివాదంలో ఏం జరిగిందో మరిచి పోతే ఎలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది వైఎస్సార్ పార్టీ .
దీనిపై ఇంకా జనసేన పార్టీ స్పందించ లేదు. మొత్తంగా వ్యక్తిగత దూషణలతో రాజకీయాన్ని మరింత రక్తి కట్టించడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Prabhas Project K : ప్రాజెక్టు కె మూవీలో విష్ణువుగా ప్రభాస్