YSRCP Slams : రామోజీ విష‌పు రాతలు మానుకో

వైఎస్సార్సీపీ షాకింగ్ కామెంట్స్

YSRCP Slams : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ఏపీ వైసీపీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ ప్ర‌భుత్వం అన్ని రంగాల‌లో అభివృద్ది సాధించింద‌ని తెలిపింది. అంతే కాదు దేశంలో ఎక్క‌డా లేని రీతిలో విద్యా, వైద్యం, ఉపాధిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింద‌ని, ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన నాడు నేడు కార్య‌క్రమం ఇవాళ దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని స్ప‌ష్టం చేసింది.

YSRCP Slams Ramoji Rao

సీఎం ప్ర‌త్యేకించి అన్ని వ‌ర్గాల‌కు చెందిన పేద‌ల పిల్ల‌లు ఉన్న‌త చ‌దువులు చ‌దువు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, పెద్ద ఎత్తున సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపింది వైఎస్సార్సీపీ(YSRCP) . సాంఘిక సంక్షేమ గురుకుల హాస్ట‌ళ్ల‌ను నాడు నేడు కింద అభివృద్ది చేసింద‌ని ఇది కూడా తెలుసు కోకుండా, క‌ళ్లుండి చూడ‌కుండా రామోజీరావు త‌న ప‌త్రిక‌లో త‌ప్పుడు రాత‌లు రాయిస్తున్నారంటూ ఆరోపించింది.

చంద్రబాబు హయాంలో ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువుల్లో కేవలం 49 మంది విద్యార్థులు సీట్లు పొందితే.. ప్రస్తుత ప్రభుత్వంలో ఏకంగా 310 మంది ప్రవేశాలు పొందారని తెలిపింది పార్టీ. ఇవి ఒక్కటే ప్రామాణికంగా చెప్పొచ్చు గురుకులాలు ఎవరి పాలనలో అభివృద్ధి చెందాయో..ఆ విష‌యం తెలుసుకోకుండా త‌ప్పుడు రాత‌లు రాయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది.

Also Read : Gudivada Amarnath : బాబుకు కుటుంబీకుల నుంచే ముప్పు

Leave A Reply

Your Email Id will not be published!