YV Subba Reddy : త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని
వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెట్స్
YV Subba Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీకి రాజధానుల విషయంలో క్లారిటీ ఇచ్చారు మరోసారి. ఆదివారం వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడారు.
త్వరలోనే విశాఖ నగరం ఏపీ రాష్ట్రానికి పరిపాలనా రాజధాని (అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ సిటీ ) అవుతుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ విషయంలో పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి , వైసీపీ శాశ్వత అధ్యక్షుడు సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పారు. ఇక పనిలో పనిగా వైవీ సుబ్బారెడ్డి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు.
పదవి లేకుండా ఒక్క క్షణం ఉండలేని బాబుకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేవలం న్యాయ పరమైన అడ్డంకులు మాత్రమే ఉన్నాయని, అవి తొలిగి పోయాక వెంటనే విశాఖ నగరం రాష్ట్రానికి పరిపాలనా పరమైన రాజధాని కావడం ఖాయమన్నారు.
దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు వైవీఎస్. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, దానిని పట్టుకుని రాద్దాంతం చేయడం అలవాటుగా మార్చుకున్నారంటూ మండిపడ్డారు.
ఇలాంటి చౌకబారు , నీతి మాలిన మాటలు మాట్లాడుతుండడం వల్లనే ప్రజలు ఈడ్చి కొట్టారని రాబోయే రోజుల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. వరద బాధితులకు ఏపీ సర్కార్ అండగా ఉంటుందన్నారు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy).
ఇదిలా ఉండగా గాయని శ్రావణి భార్గవి అన్నమయ్య పాట వివాదం తమకు సంబంధించిన అంశం కాదన్నారు. ఇది టీటీడీకి సంబంధించింది కాదన్నారు వైవీ సుబ్బారెడ్డి. సోషల్ మీడియాలో ఏవేవో వస్తుంటాయి వాటిపై స్పందించే టైం తమకు లేదన్నారు.
Also Read : నీ విజయం స్పూర్తిదాయకం – జగన్