Supreme Court : తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని స్వామి కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో గానీ, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు… తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy)ని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెవంట్ ఎస్సీ కోరారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకీ సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

YV Subbaredd Approach Supreme Court

కాగా.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ మండిపడుతున్నారు. అలాగే లడ్డూ కల్తీపై అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందేనంటూ అమిత్ షా, సుప్రీం కోర్టు సీజేకు పలువురు లేఖలు రాశారు. అంతే కాకుండా సుప్రీం కోర్టు జోక్యం కోరుతూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దు టీటీడీ ఈవో

Leave A Reply

Your Email Id will not be published!