Zabihullah Mujahid Slams : పాకిస్తాన్ పై ఆఫ్గనిస్తాన్ కన్నెర్ర
జర జాగ్రత్తగా ఉండాలన్న జబీహుల్లా
Zabihullah Mujahid Slams : పాకిస్తాన్ పై ఆఫ్గనిస్తాన్ నిప్పులు చెరిగింది. ఆఫ్గనిస్తాన్ భూ భాగాన్ని పాకిస్తాన్ లేదా మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించ కూడదని ఇస్లామిక్ ఎమిరేట్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని తాలిబాన్ దేశ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్(Zabihullah Mujahid) ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ తన పరిధిలో ఉంటే మంచిదని ఆఫ్గనిస్తాన్ తో కావాలని గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం జబీహుల్లా ముజాహిద్ చేసిన కామెంట్స్ పాకిస్తాన్ లో కలకలం రేపాయి. అంతే కాకుండా ఆఫ్గనిస్తాన్ పై రెచ్చగొట్టే ఆలోచనలకు పాకిస్తాన్ సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి దేశానికి కొన్ని పరిమితులు ఉంటాయని, కానీ తమ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆధిపత్యం చెలాయించాలని చూస్తే బాగుండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముజాహిద్(Zabihullah Mujahid).
ఇదిలా ఉండగా ఆఫ్గనిస్తాన్ లోని తెహ్రీక్ – ఇ – తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) రహస్య స్థావరాలను ఆ దేశం లక్ష్యంగా చేసుకుంటుందని పాక్ అంతర్గత శాఖ మంత్రి రాణా సనావుల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించాఉ జబీహుల్లా ముజాహిద్. నిరాధార చర్చలు, రెచ్చగొట్టే ఆలోచనలు మానుకోవాలని సూచించారు.
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ తో సహా అన్ని పొరుగు దేశాలతో సత్ సంబంధాలను కోరుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధానంగా నమ్మకం మీద సంబంధాలు ఏర్పడతాయని పాకిస్తాన్ తనను తాను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే అన్ని సమస్యలకు కారణం అవుతోందని పేర్కొన్నారు జబీహుల్లా ముజాహిద్.
Also Read : కింగ్ చార్లెస్ – 3తో మోదీ సంభాషణ