Rohit Ranjan : జీ న్యూస్ యాంక‌ర్ రోహిత్ రంజ‌న్ అరెస్ట్

రాహుల్ గాంధీ ఫేక్ వీడియో వ్య‌వ‌హారం

Rohit Ranjan :  ఢిల్లీ సమీపంలో ఉంటున్న జీ టీవీ న్యూస్ యాంక‌ర్ రోహిత్ రంజ‌న్ (Rohit Ranjan) ను మంగ‌ళ‌వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ పై ఫేక్ వీడియో ను ప్రసారం చేయ‌డంపై తీవ్ర రాద్దాంతం చెల‌రేగింది.

ఆ ఛానెల్ రాహుల్ ను త‌ప్పుదారి ప‌ట్టంచే వీడియోను ప్ర‌సారం చేసింది. ఈ మేర‌కు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో జీ టీవీ ఛానెల్ యాజ‌మాన్యం క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

ఇదిలా ఉండ‌గా తప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేసినందుకు గాను టీవీ యాంక‌ర్ రోహిత్ రంజ‌న్ పై రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌లో కేసులు న‌మోద‌య్యాయి.

కాగా రోహిత్ రంజ‌న్ ను క‌స్ట‌డీ కోసం రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ పోలీసులు యాంక‌ర్ ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కాగా యూపీలోని ఘ‌జియాబాద్ పోలీసులు అడ్డుకుని తీసుకు వెళ్లారు.

ఛ‌త్తీస్ గ‌ఢ్ టీం ఇవాళ ఉద‌యం 5.30 గంట‌ల‌కు రంజ‌న్ ఇంటికి చేరుకున్నారు. ఈ విష‌యం గ్ర‌హించిన రోహిత్ రంజ‌న్ యూపీ పోలీసుల‌కు ట్వీట్ చేశాడు.

స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా ఛ‌త్తీస్ గ‌ఢ్ పోలీసులు త‌న‌ను అదుపులోకి తీసుకునేందుకు వ‌చ్చారంటూ ఆరోపించాడు. వారెంట్

ఉన్నంత మాత్రాన ఎవ‌రికీ స‌మాచారం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని పోలీసులు బ‌దులు ఇచ్చారు.

ఘ‌జియాబాద్ పోలీసులు జ‌ర్న‌లిస్టును గుర్తు తెలియ‌ని ప్ర‌దేశానికి తీసుకు వెళ్లారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ బృందం అరెస్ట్ చేయ‌డాన్ని అడ్డుకున్నారు.

రోహిత్ రంజ‌న్ త‌న షోలో కేర‌ళ లోని వాయ‌నాడు లోని త‌న ఆఫీసుపై దాడి చేయ‌డంపై రాహుల్ గాంధీ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే రాజ‌స్తాన్,

చ‌త్తీస్ గ‌ఢ్ లో కేసులు న‌మోద‌య్యాయి. ఉద‌య్ ద‌ర్జీ హంతకుల‌పై వ్యాఖ్య‌గా దానిని న‌డిపించారు.

ఎఫ్ఐఆర్ లో అభియోగాలు మోపిన రాజ్య‌వ‌ర్థ‌న్ రాథోడ్ వంటి బీజేపీ నేత‌లు ఈ వీడియోను షేర్ చేశారు. ఇదిలా ఉండ‌గా త‌ప్పుదోవ ప‌ట్టించే

వీడియోను ప్ర‌స్తావించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

బీజేపీ , ఆర్ఎస్ఎస్ చ‌రిత్ర దేశం మొత్తానికి తెలుసు. వారు దేశాన్ని విద్వేషాల మంట్లోకి నెట్టేస్తున్నారంటూ ఆరోపించారు.

Also Read : క‌ర్ణాట‌క సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!