Zelensky Elon Musk : ఎలాన్ మస్క్ పై జెలెన్ స్కీ ఫైర్
ఈ భయానక దృశ్యాన్ని చూడండి
Zelensky Elon Musk : టెస్లా చైర్మన్, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ పై నిప్పులు చెరిగారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) . ఓ వైపు రష్యా ఏకపక్షంగా దాడులకు తెగ బడుతోందని, యుద్ధ నీతిని విస్మరించిందని ఆరోపించారు. వేలాది మంది చిన్నారులు, వృద్దులు, మహిళలు పిట్టల్లా రాలి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడో కూర్చుని శాంతి ప్రవచనాలు వల్లిస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చాలని అనుకుంటే, ఆ ఆలోచనే మీకు గనుక ఉంటే ముందు ఉక్రెయిన్ ను వల్లకాడుగా మార్చేసిన ప్రాంతాలను చూడాలని ఎలాన్ మస్క్(Elon Musk) కు సూచించారు.
ఒక బాధ్యత కలిగిన ఉన్నత పదవిలో ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. ఇప్పటికే రష్యా సైనికులు ఎక్కడ పడితే అక్కడ ఉక్రెయిన్ యువతులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు తమంతకు తాముగా రక్షణాత్మకంగా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి దారుణాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ కనిపించినా మీరు వ్యాపారం కోసం మౌనంగా ఉన్నారా అని నిలదీశారు జెలెన్ స్కీ. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో మస్క్ రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనేందుకు ఏం చేయాలంటూ ఓ పోల్ చేపట్టాడు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు ఉక్రెయిన్ చీఫ్(Zelensky) .
ఇదిలా ఉండగా రష్యా దాడిని ముగించాలని అమెరికా బిలియనీర్ చేసిన ప్రతిపాదనపై భగ్గుమన్నారు.
Also Read : జి20కి నాయకత్వం దేశానికి దక్కిన గౌరవం