Zelensky Putin : ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో యుద్దానికి దిగుతున్న రష్యా పై జెలెన్ స్కీ నిప్పులు చెరిగాడు. మారియుపోల్ లో రష్యా వేలాది మందిని పొట్టన పెట్టుకుందన్నారు. ఇది నరకం.
ఇది పదుల సంఖ్య కాదని నాకు తెలుసు. కానీ వేలాది మంది ప్రజలు. వేర్వేరు వ్యక్తులు అక్కడ చంపబడ్డారు. వేలాది మంది గాయపడ్డారని జెలెన్ స్కీ(Zelensky) ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు శాంతి ప్రవచనాలు వల్లె వేస్తూ మరో వైపు చంపుతూ పోతోందంటూ ఆరోపించారు. రష్యాతో శాంతి చర్చలు లేకుండా ఈ యుద్ధాన్ని ఆపడం కష్టమన్నాడు జెలెన్ స్కీ.
ముట్టడిలో ఉన్న ఓడ రేవు నగరమైన మారియుపోల్ కు మానవతా దృక్ఫథంతో ప్రవేశాన్ని రష్యా అడ్డుకుంటుందోని మండిపడ్డారు. ఎందుకంటే అక్కడ వేలాది మంది చంపేశారని, ఆ దారుణాలు, మారణ హోమాలు తెలుస్తాయని దాచుస్తోందంటూ సీరియస్ అయ్యారు.
జెలెన్ స్కీ టర్కీ హబర్ టర్క్ టీవీతో మాట్లాడారు. అన్ని సాక్ష్యాలను దాచడంలో రష్యా విజయాన్ని సాధించిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరు మమ్మల్ని చంపగలరు. కానీ తమపై విజయం సాధించ లేరని స్పష్టం చేశారు. రష్యా దాచస్తే దాగవు ఈ దారుణాలు. ఎప్పుడో ఒకప్పుడు బయటకువ స్తూనే ఉంటాయన్నాడు జెలెన్ స్కీ.
గాయపడిన ఉక్రేయిన్లందరినీ మీరు పాతి పెట్ట లేరన్నాడు. ఇది కేవలం సంఖ్య మాత్రమే. ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటారో చెప్పాలని నిలదీశాడు జెలెన్ స్కీ రష్యా చీఫ్ పుతిన్ ను.
Also Read : రష్యాపై భారత్ ఆధార పడొద్దు